కలుగోళమ్మపేట వద్ద అనపగుంట పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య..

 నెల్లూరు జిల్లా..

 కావలి RDO కార్యాలయంలో వరదలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి..

RDO వంశీ కృష్ణ,  మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ లకు వరద సహాయక చర్యలపై దిశా నిర్దేశం..

కలుగోళమ్మపేట  వద్ద అనపగుంట పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య..

బాలకృష్ణ రెడ్డి నగర్ లో పర్యటించి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన వరద బాధితుల సహాయక శిబిరంలో మంచినీటి ప్యాకెట్లు భోజనం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..

ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి కామెంట్స్..

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కావలిని రక్షించుకునే  పనిలో నిమగ్నమయ్యాం..

సెప్టెంబర్ 1 తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేశాం..

కావలిలో 17 cm వర్షపాతం నమోదయింది..

చంద్రబాబు నాయుడు పరిపాలనకు వరుణ దేవుడు కరుణించాడు.. ప్రకృతి పులకించింది..

అధిక వర్షపాతానికి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు..

అనధికార ఆక్రమణలు అడ్డుకట్టల వల్లే లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారు..

అధికార యంత్రాంగం మూడు రోజులుగా నిద్రాహారం మాని సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఆస్తి నష్టాన్ని నియంత్రించ గలిగాం..

చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకోబోతున్నాయి..

ఇరిగేషన్ శాఖ అధికారులు సహాయంతో త్వరలో రైతులకు నారుమళ్ళకు నీరు అందిస్తాం..

మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు  యువ రక్తంతో కూడిన అధికార యంత్రాంగం దొరికింది..

చిన్నపాటి ఆరోగ్య సమస్యతో 15 రోజులుగా అందుబాటులో లేను.

ఎలాంటి ఇబ్బంది వచ్చిన నా దృష్టికి తీసుకురండి..





google+

linkedin